Monday, 5 September 2011
మాల్కౌస్ రాగం లో అధ్భుతమైన వాఖ్యాలు
Thursday, 2 June 2011
గీతాంజలి....

గీతాంజలి..ఈ సినిమా ఓ ద్రుశ్య కావ్యం .. ఇప్పటికే ఈ వాక్యాన్ని మనం ఎన్నో సార్లు చదివి వున్నాం..విని వున్నాం.. ఆర్టికల్స్ లో నూ.. కొందరి మాటల్లోనూ .టీవీల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ లో నూ .. ఈ సినిమా లో ద్రుశ్యం గురించిన గొప్పతనం కన్నా కథ ( ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఓ ప్రారంభం, ఓ మధ్య, ఓ ముగింపు వుండే కథేమో అని మేధావులు అనుకొని గొడవకు రావద్దు. నేను మాట్లాడుతున్నది ఈ సినిమా లో వున్నకంటెంట్ గురించి. నేను ఇక్కడ కథ గా రాస్తున్నాను ) లో వున్న అంశం గొప్పది అని అంటాను నేను. ఎందుకంటే సినిమా మాధ్యమం ద్రుశ్యమే అయినప్పటికీ గొప్ప , లోతైన కథ/మానమ భావోద్వేగాలను తట్టిలేపగల కంటెంట్/ ఈ జీవితం మీద లోతైన ఓ పరిశీలనాత్మక ఆలోచనా / మనుషుల స్వభావాల్లో ని మార్మికత ( (.ఇవ్వన్నీ) లేని ఏ ద్రుశ్యమూ ఓ సినిమాను గొప్పది చేయలేదు. ఇది నేను నమ్మే సిద్దాంతం.
సహజంగా సాగే కథ.. ఆ కథ లో మనలని అడుగడుగునా తమ వెంట తీసుకెళ్ళే పాత్రలూ.. వారి మానసిక సంవేదనలే మన మానసిక సంవేదనలవటం... ప్రతి క్షణం ఆ పాత్రల అంతరంగపు అనుభూతులు మ్రుదువుగా మనలని స్పర్శిస్తూ.. ఓ తెలియని ..మాటల్లో చెప్పలేని భావోద్వేగాన్ని కలిగిస్తుండటం... . ఈ సినిమా కథ లో వున్న గొప్పతనం ఇదే.
పుట్టిన ప్రతి మనిషి కి చావు తప్పదు. ఆ చావు కు దగ్గర్లో వున్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ. ఆ ప్రేమ లో నూతనత్వం.. సహజత్వం.. తెలియని భావోద్వేగాలు.. ఉవ్వెత్తున ఎగిసిపడే ఆకాంక్షలు.. వాటిల్లో ఈ జీవితం..కాదు..కాదు.. ప్రేమలో వున్న ఈ క్షణం ..ఈ మధురమైన , గొప్పదైన ప్రేమ భావన లో వున్న ఈ క్షణం శాశ్వతంగా వుండిపోవాలనే బలమైన కోరిక.
ఈ సంఘర్షణ కథావస్తువుగా అవటమే గీతాంజలి లో నిజమైన గొప్పదనం. ఈ వస్తువనేది ఇంత లోతైనదీ, బలమైనదీ, కాకుండా ఏ సఖి సినిమాలాగానో ఓ సాధారణ విషయం అయినట్టయితే ఈ రోజున మనం గీతాంజలి గురించి పెద్దగా మాట్లాడుకోము.
నిజానికి మణిరత్నం కథలు మొదట్లో..ఆయన కెరీర్ బిగినింగ్ లో చాలా గొప్పగా వుండేవి. అవి రాను రాను ఓ మామూలు కథల్లాగా పరిణమించటం నేను గమనించాను. ఓ మౌనరాగం.. ఓ నాయకుడు.. ఓ గీతాంజలి.. ఓ దళపతి..తర్వాత కాలం లో వచ్చిన ఇద్దరు, అమ్రుత మినహాయించి మిగిలినవి మామూలు కథలే అన్నది నా అభిప్రాయం.