Sunday, 17 October 2010

ప్రపంచం వాస్తవంగా ఎలా ఉందో కాక ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ఆ ద్రుష్టి కోణం నుంచి చూసేఅందరిలాంటి వాడినే నేను కుడా


చాలా రోజుల తరవాత రాయటం ఏమోగాని . . అక్షరాలు తడబడుతున్నాయ్ ..
కొన్ని నెలల తరవాత మళ్లీ నేను ఒక మంచి పుస్తకం చదివాను .. ది ఆల్కెమిస్ట్ . పాలో కోయ్లో గురుంచి ఇంతకూ ముందు నేను చాలా విన్నాను గాని .. చదివితే ఆ రుచే వేరుగా ఉంది .. చాలా సందర్బాలలో .. గొర్రెల కాపరికి ముసలి రాజు ద్వార అతను చెప్పించిన ఫిలాసఫీ చాలా బాగుంది.. ఆనందం అంటే ఏంటో తెలుసుకోవటానికి రాజు దగ్గరకి వెళ్ళిన కుర్రవాడికి .. ఆ జ్ఞానీ ఐన రాజు చెప్పే మాటలు ... మన మెదడులో మూలాలకి తగులుతుంది ..
మనమెందుకు ఈ చిన్న విషయాన్ని గుర్తిన్చాలేకపోయం అనిపిస్తుంది .. నా వారకు నేను చాలా సందర్భాలలో అలంటి విషయాలని గుర్తిన్చాలేకపోయాను ..
ప్రపంచం వాస్తవంగా ఎలా ఉందో కాక ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ఆ ద్రుష్టి కోణం నుంచి చూసేఅందరిలాంటి వాడినే నేను కుడా ( గొర్రెల కాపరి చేత రచీత అనిపించే మాటలివి )

ఇలాంటి మాటలు సంభాషణలు పుస్తకం నిండా చాలా ఉన్నాయి .. అందుకేనేమే తత్వ జ్ఞానాన్ని ఇష్టపడే నా లాంటి వాళ్ళకి ఈ పుస్తకం కొంత దాహాన్ని తీరుస్తుంది ...

No comments:

Post a Comment